37.2 C
Hyderabad
Monday, April 20, 2026
No menu items!

క్షణికావేశమా? ఉద్దేశపూర్వకంగానా?

(బాలే అజయ్, తెలంగాణ సామ్నా , 9290277727)

మంగళవారం తెల్లవారుజామున మాదాపూర్ గ్రామంలో వైష్ణవి (18) అనే వివాహిత హత్య స్థానికంగా సంచలనం రేపింది.
వైష్ణవి హరిబాబు ఇద్దరూ కొద్ది నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నట్టుగా సమాచారం.
కొంత కాలం ఉన్న వీరి కాపురం సజావుగానే సాగింది. కానీ కొద్ది రోజులుగా ఇరువురి మధ్యన మనస్పర్థలు రావడం మొదలైనట్టు తెలిసింది. తరచూ గొడవలు జరిగినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి దంపతులు గదిలోకి వెళ్ళారు. అప్పటికే గొడవలు ఉండడంతో గదిలోకి వెళ్లినాక ఇంకా గొడవ ఎక్కువ అయినట్టు చెబుతున్నారు. ఈ గొడవలో భర్త హరిబాబు వైష్ణవి పై కత్తితో దాడి చేసి హత్య చేసినట్టు తెలుస్తోంది. ఈ సంఘటన మంగళవారం ఉదయం సుమారు నాలుగు నుండి ఐదు గంటల మధ్యన జరిగినట్టుగా తెలుస్తున్నది. హంతకుడు అయిన భర్త ఇంటి నుండి సుమారు 5:30 గంటలకు వెళ్ళిపోయినట్టు సమాచారం. ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం కోరుట్ల సిఐ సురేష్ బాబు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల దర్యాపు అనంతరం కేసుకు సంబంధించిన మరింత సమాచారం అందే అవకాశం ఉంది. కాగా మృతురాలు వైష్ణవి నాలుగు నెలల గర్భవతి.

(భార్యను హత్య చేసిన భర్త హరిబాబు ఫోటో)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles