తెలంగాణ సామ్న: క్రిస్మస్ వేడుకల్లో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మెదక్ చర్చి వందేళ్ల వేడుకల్లో పాల్గోన్నారు. ఈ సందర్భంగా తాను మెదక్ చర్చి వందేళ్ల వేడుకల్లో పాల్గోనడం ఆనందంగా వుందని తెలిపారు. ఈ వేడుకల సందర్భంగా రేవంత్రరెడ్డికి ఇతర కాంగ్రెస్ నాయకులకు ఫాస్టర్లు ఆశీర్వచనం చేశారు. అనంతరం ఆయనకు చర్చి నమూనాను జ్ఞాపికగా అందజేశారు. ఇందిరమ్మ రాజ్యంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ది కార్యక్రమాలకు శంఖుస్థాపన చేశారు.
అయితే చర్చిలో జరిగిన ఈ కార్యక్రమానికి ఒక ప్రత్యేకతగా వుందని రేవంత్రెడ్డి అభిమానులు చెబుతున్నట్లుగా తెలుస్తున్నది. అంతకుముందు జరిగిన పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గోన్న రేవంత్రెడ్డి, టిపిసిసి అధ్యక్షుడుమహేష్కుమార్ గౌడ్, మంత్రి రాజనర్సింహలతో పాటు ఇతర కాంగ్రెస్ నాయకులు సహ అక్కడి నిర్వహకులు నుదుటిన పెట్టిన బొట్టును తీసివేయకుండా క్రిస్మస్ వేడుకల్లో పాల్గోనడం ప్రాధాన్యత సంతరించుకుందని చాలా మంది అంటున్నారు.గతంలో కర్ణాటకలో ఒక సమావేశానికి హజరు అవుతున్న ఖర్గే నుదుటిన బొట్టును తుడిచేసుకొని సమావేశంలో పాల్గోన్నట్లు కాకుండా నిజమైన ధర్మప్రచారకులుగా, సెక్యులర్లుగా కాంగ్రెస్ నాయకులు వ్యవహరించారనే ప్రశంస వస్తున్నది.
